జగిత్యాల జిల్లాలో పట్టపగలే దారుణంగా ఓ యువకుడిని హత్య చేశారు. మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన ఓ యువతిని పెగడపల్లి మండలం బత్కేపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ప్రేమించాడు. వారి ప్రేమ వ్యవహరంపై మాట్లాడటానికి మహేష్ యువతి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడిపై యువతి కుటుంబ సభ్యులు ముందుగా మహేష్ తో వాగ్వాదం జరిగింది.
అక్కడ యువతి తల్లి, తాతతో మహేష్ కు గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త పెద్దదై తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో మహేష్ కత్తితో యువతి తల్లి, తాతపై దాడికి దిగాడు. అయితే.. మహేష్ దాడిని ప్రతిఘటిస్తూ కుటుంబ సభ్యులంతా ముకుమ్మడిగా అతనిపై దాడి చేయడంతో మహేష్ అక్కడకక్కడే మృతి చెందాడు.