కొండగట్టు ఈవో బాలకృష్ణ సస్పెండ్

హైదరాబాద్, వెలుగు :  జగిత్యాల జిల్లా కొండగట్టు టెంపుల్  ఈవో బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బాలకృష్ణ తన విధి నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి విచారణ జరిపారు. విచారణలో తేలిన అవకతవకలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించటంతో తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.