పండగొచ్చిందంటేచాలు ఫ్యామీలీ మొత్తం ఊర్లకు వెళ్తారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి, సొంతింటికి వెళ్తారు. ఇదే ఛాన్స్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు పగలగొట్టి ఉన్నకాడికి దోచుకెళ్తున్నారు దొంగలు. పండగొస్తే చాలు ఈ తరహా చోరీలపై పోలీసులకు మస్తు ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ క్రమంలోనే పోలీసులు ముందు జాగ్రత్తగా పండగ పూట ఊరికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. మైకులు పెట్టి ప్రచారం చేస్తున్నారు.
లేటెస్ట్ గా జగిత్యాల జిల్లా పోలీసులు గ్రామగ్రామాన ఆటోలో మైకులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. దొంగలు పడుతున్నారు..పండుగ పూట ఊర్లకు వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఇళ్లు విడిచి వెళ్లే వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కనిపించినా డయల్ 100 కాల్ చేయాలంటూ చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ తరహా ప్రచారం మంచిదేనంటూ కామెంట్ చేస్తున్నారు.