ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. ప్రజలకు అందుబాటులో లేకపోయేవాడిని: జీవన్ రెడ్డి

ఎన్నికల్లో గెలుపు ఓటములు తనకు సహజమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ హోదాలో తన బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోయేవాడినని అన్నారు.

జగిత్యాల నియోజకవర్గానికి అనునిత్యం.. అందుబాటులో ఉండి, తన సేవలు అవసరమని.. దేవుడు తనను నియోజకవర్గానికి పరిమితం చేశాడని తెలిపారు. ప్రభుత్వానికి తాను అంటే గౌరవం ఉందని.. తన మాట ఎవరు కాదనరని.. ఎమ్మెల్యే గా గెలుస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంత అబివృద్ది చేస్తానో.. ఇప్పుడు అంతకు రెట్టింపు అభివృద్ది చేస్తానని జీవన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.