
ఏజెంట్‌పై పోలీసులకు జగిత్యాల జిల్లా యువకుల ఫిర్యాదు
మల్యాల, వెలుగు : గల్ఫ్‌లో జాబ్‌లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఓ ఏజెంట్ చివరకు మోసం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్యాలకు చెందిన ఓ వ్యక్తి గల్ఫ్‌లోని మాల్టా, జార్జియా దేశాల్లో మంచి జాబ్‌లు ఇప్పిస్తానని సుమారు 20 మంది యువకులను నమ్మించి, ఒక్కొక్కరి వద్ద రూ. 3 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వసూలు చేశాడు. ముందుగా ప్రాసెస్ పేరుతో టూరిస్ట్ వీసా ఇప్పించి ముంబై మీదుగా మస్కట్ తీసుకెళ్లాడు.
అట్నుంచి తిరిగి ముంబై తీసుకొచ్చిన ఏజెంట్ మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లాడు. మూడు నెలల నుంచి అక్కడే ఉంటుండగా.. నాలుగు రోజుల కింద ఏజెంట్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఇంటికి చేరుకున్నారు. ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితులు స్థానిక నేతలతో కలిసి బుధవారం ఎస్సై నరేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.