పోలీసుల వేధింపులు తాళలేక ఓ గోల్డ్ స్మిత్ వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాం బజార్ లోని శ్రీపాద ప్రసాద్ అనే గోల్డ్ స్మిత్ వ్యాపారి పోలీసుల తన వేధిస్తున్నారని ఆరోపిస్తూ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నాని పాల్పడ్డారు. దీంతో స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు గోల్డ్ రికవరీ పేరుతో జువెలరీ షాప్ కు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వృద్ధురాలు దగ్గర ఐదు తులాల బంగారం కొనుగోలు చేస్తే.. అవి దొంగిలించిన బంగారం అని, మీరు 15 తులాల గోల్డ్ కట్టాలని టార్చర్ పెడుతున్నారని తెలిపారు. మాకు పనులు లేక కులవృత్తి జువెల్లరీ షాప్ నడుపుకుంటున్నామని చెప్పారు. గతంలో కూడా పోలీసులు ఇలానే వేధించారని బాధితులు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.