జగిత్యాల యువతి డెత్ మిస్టరీ.. అక్క పడుకున్నప్పుడు నేను వెళ్లిపోయా

జగిత్యాల జిల్లా కోరుట్ల భీమునిదుబ్బలో  ఆగస్టు 29న  అనుమానాస్పద స్థితిలో చనిపోయిన దీప్తి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హత్య జరిగినప్పటి నుంచి మృతురాలి  చెల్లెలు  చందన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.  అయితే ఇవాళ(ఆగస్ట్ 30) తన చెల్లెలు చందన.. తన సోదరుడు సాయికి పంపిన ఆడియో కలకలం రేపుతోంది. 

ఈ  ఆడియోలో  చందన  మద్యం, భాయ్ ఫ్రెండ్స్ గురించి ప్రస్తావించింది.  అక్కను తాను చంపలేదని ఇద్దరం కలిసి మద్యం తాగామని వెల్లడించింది.  తన స్నేహితునితో బ్రీజర్,  వోడ్కా తెప్పించుకున్నామని.. తాను బ్రీజర్ తాగగా..  అక్క సగం బాటిల్   వోడ్కా తాగి సోఫాలో మత్తులో పడుకుందని చందన చెప్పింది. అయితే   అక్కను లేపితే మత్తులో ఉండి లేవలేదని.. ఇదే ఛాన్స్  దొరికిందనుకొని  తాను తన భాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిపోయానని..అక్కను ఎందుకు చంపుతానంటూ  చందన  మాట్లాడింది.  

ALSO READ :చెల్లెలు అదృశ్యం.. సోఫాలో అక్క శవం

అయితే  అక్క కూడా తన భాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలుస్తానంటే తాను వద్దన్నానని ఆడియోలో చందన చెప్పడం కలకలం రేపుతోంది. . అయితే ఆ భాయ్ ఫ్రెండ్ ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది.   దీప్తిని హత్య చేశారా? లేదా ఇతర కారణాల వల్ల చనిపోయిందా  అనేది  తేలాల్సి ఉంది.

చందన ఆగస్టు 29న   తెల్లవారుజామన 5 గంటలకు  కోరుట్ల బస్టాండ్ లో మరో యువకునితో కలిసి బస్సు ఎక్కినట్లుగా సీసీ కెమెరా  ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన  పోలీసులు..  వారి ఆచూకి కనిపెట్టేందుకు  రెండు టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.