విరగపూసిన మామిడి.. పూత ఎక్కువగా ఉండడంతో భారీ దిగుబడులపై రైతుల ఆశలు

విరగపూసిన మామిడి.. పూత ఎక్కువగా ఉండడంతో భారీ దిగుబడులపై రైతుల ఆశలు
  • గతేడాది తగ్గిన దిగుబడులు 
  •  జగిత్యాల జిల్లాలో ఏటా 35వేల ఎకరాలకు పైగా సాగు 
  •  మూడేండ్ల కింద జిల్లాను ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు.. 
  •  అయినా దక్కని గిట్టుబాటు ధర.. నష్టపోతున్న రైతులు 
  •  ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  

జగిత్యాల, వెలుగు:ఈసారి జగిత్యాల జిల్లాలో మామిడి పూత విరగబూసింది. గతేడాది దిగుబడులు తగ్గగా.. ఈసారి భారీగా పెరిగే చాన్స్​ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిగుబడి రాకపోవడంతోపాటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కాగా ఈసారి దిగుబడులు భారీగా పెరిగే అవకాశమున్నప్పటికీ గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

 మూడేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను మామిడి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించినప్పటికీ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. దీంతో ఏటా మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రొసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

35 వేల ఎకరాల్లో సాగు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 35వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. జగిత్యాల మామిడి కాయలు రుచికరంగా ఉండడంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. గతేడాది సగటున ఎకరానికి 50–60 టన్నుల చొప్పున 35 వేల ఎకరాలకు 1.75 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో సగానికి పైగా మహారాష్ట్రలోని పుణె, ఢిల్లీకి ఎగుమతి అయింది. అక్కడి నుంచి విదేశాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవారు. ప్రస్తుతం మామిడి పూతను బట్టి చూస్తే ఎకరానికి 80 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 2.80 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుతోనే రైతులకు లబ్ధి 

జిల్లాలో మామిడి సాగును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించింది. కానీ ఆ తర్వాత దానిపై ఎలాంటి కదలిక లేదు. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి, కార్యాచరణ మొదలుపెడితే రైతులకు సాగులో మెలకువలతోపాటు మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యాపారులు రైతుల నుంచి నేరుగా మామిడిని కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ప్రభుత్వం అన్ని రకాల టెస్టులు చేసి సర్టిఫై చేస్తేనే ఇతర దేశాలకు ఎగుమతి చేసే వీలుంటుంది. గతంలో ఇక్కడి రైతులు కొన్ని నిషేధిత రసాయనాలు వాడడంతో పలు దేశాలు ఎగుమతులను నిలిపేసిన సందర్భాలూ ఉన్నాయి. 

ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు వల్ల రసాయనాల వినియోగం, సాగులో టెక్నాలజీ వినియోగం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జగిత్యాల మామిడికి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతుంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి ఎక్స్ పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా తమకు లబ్ధి చేకూరుతుందని జగిత్యాల రైతులుభావిస్తున్నారు.