తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా దోపిడీకి పాల్పడుతున్నారు దొంగలు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని వెంకటరావుపేట్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి 5 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 30 వేల నగదు, ఒక లాప్ టాప్ ను ఎత్తుకెళ్లారు.
ALSO READ :- గుడ్ న్యూస్ .. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు
రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి.. కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లారు. ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం దోపిడీ చేసినట్లు గుర్తించారు. చోరీపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేస్తున్నారు.