- జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్
జగిత్యాల, వెలుగు : 60 ఏండ్లు నిరాదరణకు గురైన గిరిజనులు బీఆర్‌ఎస్ తొమ్మిదేండ్ల పాలనలోనే అభివృద్ధి చెందారని, ఏండ్లుగా నోచుకోని పోడు భూములకు గిరిజనులను పట్టాదారులుగా చేశామని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగత్యాల జిల్లాకేంద్రంలో నియోజకవర్గ స్థాయి గిరిజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత ఒక్క బీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. గిరిజన తండాలను జీపీలుగా మార్చి గిరిజనులను పాలకులను చేశారన్నారు. సమావేశంలో రాయికల్‌ఎంపీపీ సంధ్యా రాణి, జడ్పీటీసీలు జాదవ్ అశ్విని, మనోహర్ రెడ్డి, ఎంపీటీసీలు లావణ్య, కవిత పాల్గొన్నారు