‘శుక్రవారం’ పూజల్లో ఛైర్ పర్సన్ ఆశావాహులు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. మరోవైపు తర్వాత బల్దియా ఛైర్ పర్సన్ ఎవరనే దానిపై పట్టణవాసుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఆశావాహులు వరుస దావత్ లు ఏర్పాటు చేస్తూ కౌన్సిలర్ల మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా పద్మశాలి, కాపు సామాజికవర్గాలకు చెందిన మహిళా కౌన్సిలర్ల భర్తలు గత బుధవారం ఒకరు, శుక్రవారం మరొకరు వరుసగా శుక్రవారం పూజ(లక్ష్మీపూజ)లు నిర్వహిస్తున్నారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన అడువాల జ్యోతి, సమిండ్ల వాణి, పల్లెపు రేణుక చైర్ పర్సన్ రేసులో ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు బర్త్​డే పార్టీలు గ్రాండ్ గా చేసుకుంటుంటే కౌన్సిలర్లను ప్రస్తన్నం చేసుకునేందుకు ఆశావహులు శుక్రవారం పూజలు చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.