పండగొచ్చిందంటే చాలు చాలా షాపులు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తాయి. కస్టమర్లను రప్పించేందుకు విచ్చలవిడి ఆఫర్లు ఇస్తాయి. బట్టల షాపులు, ఫోన్ల షాపులు, చెప్పల షాపులు తెగ ఆఫర్లు ఇస్తాయి. జనం క్యూ కడతారు. 1+1 అని..2+1 అని ఇలా రకరకాల పండగ ఆఫర్లు ఇస్తాయి. ఇలాంటి ఆఫర్లు పండగ వస్తే చాలానే చూస్తాం. అయితే జగిత్యాల జిల్లాలో ఓ మటన్ షాపు యాజమాని ఇచ్చిన ఆఫర్ చూస్తే అవాక్కవుతారు. ఇంతకీ ఆ ఆఫర్ ఎందనుకుంటున్నారా?
10 కేజీల మటన్ తీసుకుంటే..5 కేజీల చికెన్ ఫ్రీ
5 కేజీల మటన్ తీసుకుంటే.. 2.5 కేజీల చికెన్ ఫ్రీ
3 కేజీల మటన్ తీసుకుంటే.. 1.5కేజీల చికెన్ ఫ్రీ
1 కేజీ మటన్ తీసుకుంటే.. 500 గ్రాముల చికిన్ ఫ్రీ
500 గ్రాముల మటన్ తీసుకుంటే..250 గ్రాముల చికెన్ ఫ్రీ
అయితే ఈ ఆఫర్ ఏదో ఒక ఫెస్టివల్ రోజే కాదు. ప్రతిరోజు సంవత్సరం మొత్తం ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒక్క శనివారం, సోమవారం దుకాణానికి సెలవంట. షాపు కొత్తగా పెట్టానని..కస్టమర్స్ వాళ్లంతట వాళ్లే రావడానికే ఈ ఆఫర్ పెట్టానని యాజమాని చెబుతుండు. ఏదైతేనేం..జనం మటన్ తీసుకునేందుకు ఎగబడుతున్నారు. షాపుల ముందు బోర్డే కాదు సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం చేస్తుండు.