పేలుళ్లకు కొద్దిగంటల ముందు.. ఇల్లుచేరిన జగిత్యాల వాసులు

పేలుళ్లకు కొద్దిగంటల ముందు.. ఇల్లుచేరిన జగిత్యాల వాసులు

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జిల్లా నుంచి శ్రీలంకకు ఏడు కుటుంబాలు విహారయాత్రకు వెళ్లాయి. పేలుళ్ల విషయం తెలిసి ఆయా కుటుంబాలవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లాలోని మెట్ పల్లికి చెందిన ఎలెటీ నరేందర్ రెడ్డి, వందన, అల్లాడి శ్రీనివాస్, సత్యదేవి, కోరుట్లపట్టణానికి చెందిన బాశెట్టి కిషన్,వరలక్ష్మి, బాశెట్టి లక్ష్మీనారాయణ, మణి, తాటికొం డరమేష్, నాగమణి, దొంతు ల రమేష్,రమాదేవి, ముక్క మనోహర్, గోదావరి దంపతులు కొలంబో వెళ్లారు. అక్కడే ఆరురోజులు ఉండి పర్యాటక ప్రదేశాలను చూశారు. ఆదివారం కొలంబో ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. ఉదయం 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. ఎయిర్ పోర్టులో దిగగానే కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల సమాచారం తెలుసుకొని వారు షాక్ కు గురయ్యారు. తాము ఉన్న హోటళ్ల దగ్గరే పేలుళ్లు జరిగాయని, కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నామని వారు తెలిపారు.

తప్పించుకున్న అనంత వాసులు
ఏపీలోని అనంతపురం జిల్లా వాసులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ అధినేత అమిలినేని సురేంద్ర బాబు తన నలుగురు స్నేహితులతో కలిసి కొలంబోటూర్ కు వెళ్లారు. షాంగ్రీలా హోటల్ లోఆదివారం బ్రేక్ ఫాస్ట్​ చేస్తుండగా అక్కడ బాంబు పేలుడు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో హోటల్‌ అద్దం తగిలిసురేంద్ర బాబు ముక్కుకు స్వల్ప గాయమైంది. ఈ బృందం సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వారికి సంబంధించి నపాస్ పోర్టులు, ఇతర పత్రాలన్నీ హోటల్ లోనే ఉండిపోయాయి.