ఘరానా దొంగల ముఠా అరెస్ట్ 

పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి వైన్ షాపుతో పాటు రాయపట్నంలోని శివాలయంలో దొంగతనానికి యత్నించిన నిందితులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారంకు చెందిన గంధం నరేష్, తుర్పాటి మైసయ్య లు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపెట్ కు చెందిన పత్తి కనుకయ్యతో కలిసి గత మూడు రోజుల క్రితం వెల్గటూర్ వైన్స్, రాయపట్నం శివాలయంలో చోరికి పాల్పడ్డారు. దీంతో స్తంభం పెళ్లిలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అరెస్టు చేసి.. నిందితుల నుండి రెండు టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్స్, నాలుగు విస్కీ బాటిల్స్, ఒక ఐరాన్ రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పారిపోయిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.