ప్రస్తుతం ఉద్యోగం దొరకడం అంటే అంత ఈజీ కాదు. ఉద్యోగాలు లేని ఎంతో మంది యువతీ యువకులు అవకాశాల కోసం రోజు సర్టిఫికెట్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఎక్కడైనా చిన్న ఉద్యోగమైనా దొర్కపోతదా అని ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మన జగిత్యాల జిల్లా పోలీసులు మంచి అవకాశం కల్పించారు. జగిత్యాల జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
ఈ విషయంలో జగిత్యాల జిల్లా పోలీసులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. 2 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళ నిర్వహించామన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఈ మెగా జాబ్ మేళాలో ఐటీ,నాన్ ఐటీ , బ్యాంకింగ్, ఫార్మసీ వంటి రంగాలకు చెందిన 50 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
ALSO READ | సింగరేణిలో మహిళా ఆఫీసర్లు.. పురుష ఆఫీసర్లతో సమానంగా అండర్ గ్రౌండ్ మైన్లలో వర్క్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొనగా కంపెనీలు పలువురిని ఎంపిక చేసుకున్నాయి. ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకా ఇబ్బంది పడుతున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. ఉద్యోగం ఎక్కడ వచ్చినా వెళ్లి జాయిన్ కావాలని తరువాత గ్రోత్ అదే వస్తుందని చూచించారు. జాబ్ మేళాకు ఐటీ, నాన్ ఐటీ, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫార్మసీ వంటి కంపెనీలు వచ్చాయని చెప్పారు ఎస్పీ.