జగిత్యాల జిల్లాలో పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్

జగిత్యాల జిల్లాలో పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్

జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం  జగిత్యాలలోని ఫైరింగ్ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. శిక్షణను ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించారు. అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వెపన్ వినియోగాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ఫైరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిభ కనబర్చిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. శిక్షణలో  డీఎస్పీలు రఘు చందర్, రాములు, రంగారెడ్డి, ఎస్బీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగేశ్వర్ రావు, రిజర్వ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు సిబ్బంది పాల్గొన్నారు.