జగిత్యాల జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్ర సరిగా పని చేయకపోవడంతో తమకు వేతనాలు తక్కువగా వస్తున్నాయని ఆందోళన చేపట్టారు. వేలి ముద్రలు సరిగా పడకపోవడం వల్ల జీతాలు కట్ చేస్తున్నారని.. అందుకే విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టామని తెలిపారు. ఎండనక.. వాననక.. రాత్రి పగలు.. పండుగలు.. పబ్బాలు అనే తేడా లేకుండా క్రమం తప్పకుండా తాము విధులు నిర్వహిస్తుంటే వేతనాలు పెంచి అండగా నిలవాల్సిందిపోయి.. వేతనాల్లో కోతలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు మొత్తం వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.