సీఎం రేవంత్పై అభిమానం.. ఆరు గ్యారంటీలతో సంక్రాంతి ముగ్గు

సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మహిళలు రేవంతన్న రేవంతన్న అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ రోజు ఓ మహిళ రేవంత్ పై తనకున్న అభిమానాన్ని ముగ్గు రూపంలో తెలియజేసింది. 

సంక్రాంతి పండగ అంటేనే మహిళలు ఇంటి ముందు రకరకాల ముగ్గులతో అలంకరణ చేస్తూ పండగను జరుపుకుంటారు. అలాంటి ముగ్గులో ఒక మహిళ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని వేంగాలాయిపేట్ గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కుంచె రాజేందర్ సతీమణి సుమలత బోగి పండగను పురస్కరించుకుని తన ఇంటి ముందు వేసిన ముగ్గులో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను చేర్చింది.  ముగ్గు చుట్టూ జై కాంగ్రెస్,  సీఎం రేవంత్ రెడ్డి,విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లను వేసింది.  కాంగ్రెస్ పార్టీ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా పండగ పూట ముగ్గుతో తన అభిమానాన్ని చాటుకున్న ఆ మహిళను గ్రామ ఎంపీటీసీ కడారి సుప్రియ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు అభినందించారు.

 కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలలో రెండింటిన అమలు చేశారు.మిగతా వాటి కోసం ఇటీవల అభయహస్తం పేరుతో ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్లను ప్రభుత్వం జనవరి 17 లోపు ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది. ఇప్పటికే కోటికి పైగా దరఖాస్తులను ఆన్ లైన్ లో ఎంట్రీ చేశారు.