హనుమాన్(HanuMan) సినిమాతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్(Jai Hanuman) పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన పోస్టర్ కు ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. హనుమాన్ మూవీ ఎండింగ్ లో శ్రీరామునికి హనుమాన్ ఒక మాట ఇచ్చాడు అన్నట్టుగా ఎండ్ చేశారు. అదే కాన్సెప్ట్ తో జై హనుమాన్ ఫస్ట్ లుక్ లో కూడా శ్రీరాముడి చేతిలో హనుమంతులవారు చేయివేసి మాట ఇస్తున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు. దాంతో జై హనుమాన్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.
ఈక్రమంలోనే తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆడియన్స్ ను విపరీగా ఆకట్టుకుంటోంది. నిప్పులు చిమ్ముతూ వస్తున్న ఒక డ్రాగన్ హనుమంతుడి మీదకి దూసుకు వస్తున్నట్లుగా.. ఆ డ్రాగన్ కుక్ ఎదురుగా గధాధారియై హనుమంతులవారు నిల్చున్నట్టుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమాను 3Dలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ తో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఈ పవర్ఫుల్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్.. లుక్ అరాచకంగా ఉంది.. ఈసారి ఎం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.