ఆకట్టుకుంటున్న జై హనుమాన్ థీమ్ సాంగ్..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాతాళు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ కలసి సంయుక్తంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

అయితే జై హనుమాన్ లో హనుమంతుడి పాత్రలో కన్నడ ప్రముఖ హీరో మరియు డైరెక్టర్ రిశబ్ శెట్టి నటిస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జై హనుమాన్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. 

ALSO READ | స్పిరిట్ నుంచి క్రేజీ అప్డేట్.. మ్యూజిక్ మొదలెట్టేశారుగా..

దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు జై హనుమాన్ థీమ్ సాంగ్ ని చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే  ప్రముఖ సింగర్ రేవంత్ పాడగా, లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించాడు.

ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఓజస్ అధియా సంగీతం అందించాడు. యుగయుగముల యోగవిధి దాశరథి అంటూ మొదలయ్యే లిరిక్స్ మనస్సుని హత్తుకునే విధంగా ఉన్నాయి.