
- కేసముద్రం మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 3,329 రేటు పలికిన పాత వడ్లు
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ‘జై శ్రీరామ్’ రకం పాత వడ్లు క్వింటాకు రికార్డు స్థాయిలో ఏకంగా రూ.3,329 పలికాయి. గతనెల 28న గరిష్ఠంగా రూ.3,010 రేటు రాగా అంతకంటే రూ.319 అధికంగా రేటు పలకడం విశేషం.
కేసముద్రం మార్కెట్‌కు 100 మంది రైతులు 2,350 బస్తాల వడ్లు తీసుకురాగా ఈ–-నామ్ ద్వారా క్వింటాకు గరిష్ఠంగా రూ.3,329, కనిష్ఠంగా రూ.1, 509 రేటు వచ్చింది. పాత వడ్లకు డిమాండ్ ఉండడం, మార్కెట్‌కు సప్లై తక్కువగా ఉండడంతో రేటు రోజురోజుకూ పెరుగుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.