రఘువీర్​రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్​రెడ్డి

హాలియా, వెలుగు : కాంగ్రెస్​ నల్గొండ పార్లమెంట్​ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్​రెడ్డి గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్​రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం నాగార్జునసాగర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో  జరిగిన కార్యక్రమంలో త్రిపురారం మండలానికి చెందిన 400 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. 

కాంగ్రెస్​లో చేరినవారిలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు కలగాని శ్రావణ్, మద్దూరి శ్రీనివాస్, జొన్నలగడ్డ రమేశ్ రెడ్డి, చెవుల రామయ్య, గుండ్లపల్లి సునీతావెంకట్ రెడ్డి, బొబిడి అనంతరెడ్డి, జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రెమడాల హుస్సేన్, ఉప సర్పంచులు వేగుళ్ల శ్రీనివాస్, గుడిపాటి వెంకన్న, చిన్న మట్టయ్య, చేపూరి మట్టయ్యచారి, ధర్మ అరుణ్ కుమార్ రెడ్డి, గున్నూరు సూరారెడ్డి

గున్నూరు కృష్ణారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సైదులు, కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు ముడి ముళ్ల బుచ్చిరెడ్డి, నాయకులు భాస్కర్ నాయక్, అనుముల శ్రీనివాస్ రెడ్డి, బిట్టు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.