ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ విడుదల సమయంలో వెనుక గేట్ నుండి పంపడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు జైల్ డీజీ సౌమ్య మిశ్రా. అల్లు అర్జున్ ను జైలు వెనుక గేటు నుండి పంపడంలో తమ నుండి ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు సౌమ్య మిశ్రా. జైళ్ల వార్షిక నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు సౌమ్య.
చివరిసారిగా 2019 లో అన్యూల్ మీట్ ఏర్పాటు చేశామని.. 2024 లో జైల్ అదాలత్ లో 1045 లో అవకాశం కల్పించామని అన్నారు సౌమ్య. 2650 మంది ఖైదీలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని.. సత్ప్రవర్తన కలిగిన 213 మంది ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపారు.2024 లో 8 మంది ఖైదీలకు బ్యాంక్ లోన్స్ ఇచ్చామని.. జైల్లో ఉండి 750 మంది డిగ్రీ పూర్తి చేశారని, 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్ట పొందారని అన్నారు.
జైల్లో ఉన్న ఖైదీల ద్వారా ఇంటికి అవసరమైన పరికరాలను ఖైదీలతో తయారు చేయించామని.. ఖైదీల నుండి టైలరింగ్,ప్రింటింగ్ ప్రెస్ బేకరి యూనిటి,పౌల్ట్రీ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేశామని అన్నారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఉపాధి కల్పనకు అవసరమైన జాతీయ చమురు కంపెనీలతో 29 అవుట్ లే అవుట్ లెట్ల ను ఏర్పాటు చేశామని అన్నారు సౌమ్య.నుమయిష్ ఎగ్జిబిషన్ లో మా స్టాల్ ఏర్పాటు చేశామని.. గతంలో నుమయిష్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్ కి తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని తెలిపారు సౌమ్య. జైళ్లను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని.త్వరలోనే రాష్ట్రంలో ఉన్న జైళ్లను మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని తెలిపారు సౌమ్య.