పరిగి టూ సంగారెడ్డి: లగచర్ల దాడి కేసులో 16 మంది నిందితులకు జైలు ట్రాన్స్‎ఫర్

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటనలో రిమాండైన 16  మంది నిందితులకు అధికారులు జైలు ట్రాన్స్‎ఫర్ చేశారు. పరిగి సబ్ జైలు నుండి 16 మంది నిందితులను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిగి సబ్ జైల్లో 50 మంది ఖైధీలకు మాత్రమే అవకాశం ఉండటంతో వీరిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. లగచర్ల గ్రామం పరిగికి సమీపంగా ఉండడం వల్ల ములాఖత్‎ల తాకిడి పెరగడంతో పరిగి నుండి నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించారు. 

ALSO READ | SR యూనివర్సిటీలో గంజాయి కలకలం.. రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు

కాగా, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఏకంగా కలెక్టర్‏పైనే దాడి జరడగంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‎గా తీసుకుంది. ఇందులో భాగంగానే అధికారులపై దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‎కు పంపారు.