సినీ నటుడు వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో నటుడు వినాయకన్ సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. గొడవ జరిగిన సమయంలో వినాయకన్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. గోవాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్‌కు ఎక్కేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ‘జైలర్’ సినిమాలో వినాయకన్ విలన్ నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘటన పై స్పందించిన వినాయకన్ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనను ఎయిర్‌పోర్టులోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ అన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని అన్నాడు.పోలీసులు తెలిపిప వివరాల ప్రకారం .. వినాయకన్, CISF అధికారి మధ్య మాటల వాగ్వాదం తరువాత వినాయకన్ సదరు కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడని సమాచారం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ సినిమాతో ఫేమస్ అయ్యాడు వినాయకన్. ఇందులో వర్మ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో వినాయకన్ పేరు మారుమోగింది.
ఈ ‘విలన్’కు వివాదాలు కొత్తేమీ కాదు
‘జైలర్’లో విలన్‌గా నటించిన వినాయకన్ కు వివాదాలు కొత్త కాదు. 2023 అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ ను అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగాడు. నటుడు వినాయకన్ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు అక్కడికి చేరుకుని నటుడు వినాయకన్ ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అప్పుడు కూడా మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.