జైలర్ దర్శకుడితో.. పుష్ప రాజ్

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో  ‘పుష్ప2’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్‌‌‌‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత బన్నీ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్‌‌లో నటించనున్నాడనే చర్చ టాలీవుడ్‌‌లో మొదలైంది.తాజాగా ఓ తమిళ దర్శకుడి పేరు వినిపిస్తోంది. రజినీకాంత్‌‌తో ‘జైలర్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన నెల్సన్ దిలీప్ కుమార్‌‌ డైరెక్షన్‌‌లో బన్నీ నెక్స్ట్ మూవీ ఉండబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది.

ALSO READ : సిద్ధార్థ్ కొత్త చిత్రం షురూ

రీసెంట్‌‌గా అల్లు అర్జున్‌‌ను కలిసిన నెల్సన్ ఓ కథను చెప్పగా అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇదొక యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ అని,  గతంలో అల్లు అర్జున్‌‌తో  ‘రేసుగుర్రం’ చిత్రాన్ని నిర్మించిన నల్లమలపు బుజ్జి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌‌తో నిర్మించనున్నట్లు సమాచారం.