జైలర్ సక్సెస్ హవా..మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్కు గిప్ట్

 జైలర్ సక్సెస్ హవా..మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్కు గిప్ట్

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ జైలర్‌ (Jailer). ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. నెల్సన్‌ కుమార్‌ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాకు..సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ (kalanithi Maran) నిర్మించారు. దీంతో జైలర్ సక్సెస్ కి కారకులైన వారికి విలువైన గిఫ్ట్స్ ను ఇస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

ఇక లేటెస్ట్గా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్(Anirudh Ravichander) కు చెక్ అందించారు కళానిధి మారన్. జైలర్ మూవీ సక్సెస్ కు అనిరుధ్ అందించిన మ్యూజిక్ మెయిన్ పిల్లర్ గా నిలిచింది. హుకుమ్-తలైవర్ అలప్పారా, కావాలయ్యా సాంగ్స్ తో ఇండియా వైడ్ గా బాక్సాపీస్ మ్యూజిక్ షేక్ చేశారు అనిరుధ్. 

ఇక ఇప్పటికే రజినీకాంత్‌కు రూ.1.24 కోట్ల BMW X7 కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. డైరెక్టర్ నెల్సన్‌కు కూడా పోర్చే లేటెస్ట్‌ కారు (Porsche Car)ను, చెక్కును అందజేశారు. నెల్సన్‌కు ఇచ్చిన కారు ఖరీదు రూ1.25 వరకు ఉంటుందని అంచనా. రీసెంట్ గానే ఈ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

AR రెహమాన్, అమిత్ త్రివేది, విశాల్ - చంద్ర శేఖర్ వంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ను అధిగమించి..దేశంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ పొందే సంగీత దర్శకుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన అనిరుధ్.. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ మేనల్లుడు కావడం విశేషం.