ఫుల్లుగా తాగి న్యూసెన్స్.. జైలర్ విలన్ అరెస్టు

ఫుల్లుగా తాగి న్యూసెన్స్..  జైలర్ విలన్ అరెస్టు

సూపర్ స్టార్ రజనీకాంత్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్‌’లో విలన్‌గా నటించిన వినాయకన్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.  కేరళలో  ఎర్నాకుళంలోని ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న వినాయకన్‌.. ఫుల్లుగా మద్యం సేవించి చుట్టుప్రక్కల అపార్టుమెంటు వాసులను ఇబ్బంది పెడుతున్నారట. 

ఈ నేపథ్యంలో  తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆయనపై అపార్టుమెంటు వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్ స్టేషన్ కు పిలిపించగా.. పోలీసులతో  కూడా  వినాయకన్  దురుసుగా ప్రవర్తిస్తూ గొడవకు దిగడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

వినాయకన్‌ పై పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేసి జైల్ లో పెట్టినట్లు సమాచారం. గతంలో కూడా ఓ మోడల్‌ను వేధించిన ఘటనలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. జైలర్ సినిమాతో  నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన వినాయకన్‌ మరోసారి ఈ ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.