ప్రాణం తీసిన ఉపవాసం

ప్రాణం తీసిన ఉపవాసం

ఏడు రోజులు ఉపవాస దీక్ష చేపట్టిన ఓ మహిళ.. చివరకు ప్రాణాలు విడిచింది. డాక్టర్లు చెప్పినా వినకుండా అన్నం తినడం మానేసింది. కనీసం వాటర్ అయినా తాగాలని సూచించినా వినలేదు. చావును కొని తెచ్చుకున్న ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది.

వివరాలు : గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఏక్తా(25) జైన్ భక్తురాలు. దేవుడిపై అమితమైన భక్తితో జైన్ సాంప్రదాయం ప్రకారం ఆమె ఆగస్టు-27న వారం రోజుల ఉపవాస దీక్ష చేపట్టింది. ఐదు రోజులు గడిచాక ఏక్తా బాగా నీరసించి పోయింది. దీంతో బంధువులు ఆమెను హస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఏక్తాను ఆహారం తీసుకోవాలని సూచించారు.

అయినా వినకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. సెప్టెంబర్-3న స్పృహ తప్పి పడిపోయిన ఏక్తాకు డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కించారు. స్పృహ నుంచి కోలుకున్న ఏక్తా మళ్లీ మొండి పట్టుతో తన దీక్షను కొనసాగిస్తానని చెప్పింది. నీరసించి పోయిన ఏక్తా.. అదే రోజు రాత్రి గుండెపోటుతో మరణించిందని తెలిపారు డాక్టర్లు.