ఆసిఫాబాద్, వెలుగు: ఎలాంటి ఆధారాలు లేకుండా ఆర్టీసీ బస్‌లో ఓ మహిళ తరలిస్తున్న రూ.7 లక్షల 31 వేల నగదును జైనూర్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని ఉషేగామ్ శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ఉట్నూర్ నుంచి జైనూర్ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గరికముక్కు విజయ కుమారి అనే మహిళ దగ్గర ఈ నగదు పట్టుకున్నారు. ఎలాంటి రసీదు లేకపోవడంతో సీజ్‌చేసి జైనూర్ ఫ్లయింగ్ స్క్వాడ్‌కి అప్పగించినట్టు జైనూర్ సీఐ అంజయ్య తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రూ.50 వేల కన్నా ఎక్కువ తీసుకొని వెళ్తే దానికి సంబంధించి సరైన ఆధారాలు, పత్రాలు రసీదులు ఉండాలని సూచించారు.
వాంకిడిలో రూ.లక్ష
వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో రూ.1లక్ష నగదు పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి మంచిర్యాలకు కారులో వెళ్తున్న వ్యక్తి వద్ద రూ.1లక్ష పట్టుకున్నామని, ఎఫ్ఎస్టీ టీంకు అప్పగించినట్లు చెప్పారు. తనిఖీల్లో వాంకిడి ఎస్ఐ సాగర్, సిబ్బంది పాల్గొన్నారు.