విలువలు కలిగిన నేత జైపాల్​రెడ్డి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: విలువల కోసం తపించిన వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి అని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా జైపాల్ రెడ్డి స్ఫూర్తి పురస్కారం అవార్డుల కార్యక్రమాన్ని జేపీఎన్సీ ఇంజనీరింగ్  కాలేజీలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ గా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని గుర్తుంచుకుంటారని తెలిపారు. పట్టణంలో నిర్మిస్తున్న వెజ్  మార్కెట్  బిల్డింగ్​లో జైపాల్ రెడ్డి నాలెడ్జ్  సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జైపాల్ రెడ్డి స్పూర్తి పురస్కారం–2025ను దుప్పల్లి శ్రీరాములు, వరకవుల నరహరి రాజుకు అందజేసి ఘనంగా సన్మానించారు. జేపీఎన్సీ చైర్మన్  కేఎస్  రవి కుమార్, మైనారిటీ కార్పొరేషన్  చైర్మన్  ఓబేదుల్లా కొత్వాల్, కె యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వి.మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆమనగల్లు: కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి జయంతిని గురువారం ఆయన స్వగ్రామమైన మాడ్గుల్ తో పాటు ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఆయన విగ్రహం, ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టి గౌరవించిందని పలువురు నేతలు పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్, బిఖ్యా నాయక్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాట నరసింహ, భట్టు కిషన్ రెడ్డి, జగన్, బిచ్యా నాయక్, జంగయ్య, భాస్కర్  పాల్గొన్నారు.