కడ్తల్ వరకు మెట్రో: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కడ్తల్ వరకు మెట్రో: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, వెలుగు:  రంగారెడ్డి జిల్లా కడ్తాల్  వరకు మెట్రో సేవలను విస్తరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. రైతు రుణమాఫీ చేసిన సీఎంకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు  రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా కందుకూరు వరకు విస్తరించిన మెట్రో సేవ లను కడ్తల్ వరకు పొడిగించాలని సీఎంకు విజ్ఞప్తి చేయగా  సానుకూలంగా స్పందించారన్నారు. మెట్రో ఎండీతో మాట్లాడి ప్రతిపాదనలు పంపించాలని మంత్రి హరీశ్ రావును ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.