Jaipur hit-and-run case: హిట్ అండ్ రన్ కేసులో..కాంగ్రెస్ నేత ఉస్మాన్ ఖాన్ పార్టీనుంచి బహిష్కరణ

Jaipur hit-and-run case: హిట్ అండ్ రన్ కేసులో..కాంగ్రెస్ నేత ఉస్మాన్ ఖాన్ పార్టీనుంచి బహిష్కరణ

జైపూర్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు ఉస్మాన్ ఖాన్ ను కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించారు. నహర్ గఢ్ విషాద ఘటనలో కారు నడిపిన వ్యక్తికి కాంగ్రెస్ తో సంబంధాలున్నాయని గుర్తించిన జైపూర్ నగర కాంగ్రెస్ కమిటీ..పార్టీ జిల్లా కార్యనిర్వాహఖ కమిటీ నుంచి ఉస్మాన్ ఖాన్ ను తొలగించారు. 

నహర్ గఢ్ ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. 8మంది గాయపడ్డారు. డ్రైవర్ మద్యం సేవించి ఇరుకైన చిన్న రోడ్లపై వేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  అంతేకాదు పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న వాహనాలను కూడా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. వీరేంద్ర సింగ్(48), మమతా కన్వర్(50), మోనేష్ సోని , మహ్మద్ జలాలుద్దీన్, దీపికా సైని , విజయ్ నారాయణ , జెబున్నిషా, అన్షిక, అవధేష్ పరీరు గాయపడ్డారు. 

నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు

నిందితుడు ఉస్మాన్ ఖాన్ ఘటన జరిగిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడని వైద్య పరీక్షలో నిర్దారించారు. మృతురాలి తండ్రి మమతా కన్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఉస్మాన్ ఖాన్ పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా నాలుగు స్టేషన్ల పోలీసులు ఘటన జరిగిన నహర్ గఢ్ రోడ్డులో మోహరించారు.