జైపూర్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లింగ్ విక్టరీ

జైపూర్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లింగ్ విక్టరీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌లో  జైపూర్ పింక్ పాంథర్స్‌‌‌‌ మూడో విజయం సాధించింది.  మంగళవారం గచ్చిబౌలిలో ఇండోర్‌‌‌‌ స్టేడియంలో హోరాహోరీగా సాగిన లీగ్ పోరులో జైపూర్ 33–30తో యూపీ యోధాస్‌‌‌‌పై గెలిచింది. జైపూర్ టీమ్‌‌‌‌లో నీరజ్‌‌‌‌ నర్వాల్ తొమ్మిది,  కెప్టెన్‌‌‌‌ అర్జున్ దేశ్వాల్‌‌‌‌ ఐదు పాయింట్లతో రాణించారు.  ఈ లీగ్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ 1000 రైడ్‌‌‌‌ పాయింట్ల క్లబ్‌‌‌‌లో చేరాడు. యోధాస్ తరఫున ఆల్‌‌‌‌రౌండర్ భరత్  7 పాయింట్లతో పోరాడాడు. మరో మ్యాచ్‌‌‌‌లో యు ముంబా 32–26తో దబాంగ్ ఢిల్లీ కేసీని ఓడించింది. ముంబా ఆటగాళ్లు  మంజీత్‌‌‌‌(9), జఫర్దనేష్‌‌‌‌(5), తమ జట్టును గెలిపించారు. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 11 పాయింట్లతో రాణించాడు.