ప్రియుడితో భర్తను చంపి.. డెడ్ బాడీని దర్జాగా బైక్ పై అడవికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రియుడితో భర్తను చంపి.. డెడ్ బాడీని దర్జాగా బైక్ పై అడవికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మర్చంట్ నేవీ ఆఫీసర్ ను చంపేసి సింమెంట్ లో ప్యాక్ చేసిన ఒక ఇళ్లాలు ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘోర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు కేసుల్లో సేమ్ యాక్షన్ ప్లాన్. సేమ్ క్రుయాలిటీ. అక్కడ సిమెంట్ డ్రమ్ములో ప్యాక్ చేస్తే.. ఈ కేసులో ఓ సంచిలో ప్యాక్ చేసింది లవర్ తో కలిసి మరో ఇల్లాలు. దర్జాగా బైక్ పైనే శవాన్ని పార్సల్ చేసి పోలీసుల కళ్లు కప్పాలని చూసింది. ఇంత క్రూరంగా, కట్టుకున్న వాడినే కడతేర్చిన ఈ మహాఇళ్లాలు ఎలా దొరికిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న బంగారం లాంటి భర్తను కడతేర్చిన ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటుచేసుకుంది. గోపాలిదేవి (42) అనే మహిళ ధనలాల్ సాయిని అనే  తన భర్తను.. ప్రియుడు దీన్ దయాల్ కుశ్వాహతో కలిసి చంపేసింది. డెడ్ బాడీనీ ప్యాక్ చేసి బైక్ పైనే అడవికి తీసుకెళ్లారు. వీళ్లు దర్జాగా డెడ్ బాడీని బైక్ పై తీసుకెళ్లడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. బాడీని దగ్గర్లోని ఫారెస్ట్ కు తీసుకెళ్లి కాల్చేశారు. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. 

Also Read : మినీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ధనలాల్ సాయిని కూరగాయల వ్యాపారం చేస్తుండేవాడు. గత ఐదేళ్లుగా గోపాలిదేవి.. కుశ్వాహ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపతోంది. తన భార్య కుశ్వాహతో సంబంధం పెట్టుకుందనే అనుమానం రావడంతో ఆమెపై నిఘా పెట్టాడు సాయిని. మార్చి 15న కుశ్వాహ షాప్ ‘శ్యాప్ ఫ్యాషన్స్’ కు వెళ్లి అక్కడ కుశ్వాహతో తన భార్యను చూసి షాక్ కు గురయ్యాడు. 

వీళ్ల వ్యవహారంపై ఆగ్రహించిన సాయినిని రాడ్ తో కొట్టాడు కుశ్వాహ. స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే తాడుతో ఉరి బిగించి చంపేశారు. పెద్ద ప్లాస్టిక్ కవర్ లేదా బ్యాగ్ లో బాడీని కుక్కి దగ్గరలో భైరుజ్ టెంపులో రోడ్ సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ బాడీని తగలేశారు. అయితే సీసీటీవీలో బైక్ పై డెడ్ బాడీని ప్యాక్ చేసి తీసుకెళ్లిన ఘటన రికార్డు అవ్వడంతో వీళ్ల బండారం బయటపడింది. మార్చి 16న అడవిలో సగం కాలిన డెడ్ బాడీని కనుగొన్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ నిర్ధారించుకుని ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు. విచారణలో చేసిన తప్పును ఒప్పుకుంది దేవి. 

ఉత్తరప్రదేశ్ మీరట్ లో మర్చంట్ నేవీ ఆఫీసర్​ను అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసి.. ఆపై అతని డెడ్​ బాడీని15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీల్ చేసిన ఘటన జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే ఈ  దారుణం జరగటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.