జైపూర్, వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాటులో మరో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని ఎస్టీపీపీ జీఎం ఈడీ కె.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం రిపబ్లిక్ డే వేడుకల్లో ఎస్టీపీపీ అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
ఎస్టేపీపీలో మరో 800 మెఘావాట్ల యూనిట్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్లాంట్పూర్తయితే రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ సరఫరాలో తమ వంతు పాత్ర పోషించగలమన్నారు. ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించారు.