
ఎగ్జిట్ పోల్‌లను కాంగ్రెస్ బూటకమని కొట్టిపారేసింది కాంగ్రెస్. ఎగ్జిట్ పోల్ ఓ బోగస్ అని ..అవి ఎన్నికల రిగ్గింగ్‌ను సమర్థించేందుకు ప్రధాని మోడీ సైకలాజికల్ గేమ్‌లు చేస్తున్నారని, బ్యూరోక్రసీని భయపెట్టేందుకు, ప్రతిపక్షాల నైతికతను తగ్గించే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
మరోవైపు శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ట్వీట్ కు సమాధానం ఇవ్వాలని సీఈసీ కోరింది. ఓట్ల లెక్కింపుకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 150 మంది అధికారులను బెదిరించారని జైరాం రమేష్ ఆరోపించారు.. జూన్ 4 న ఓట్ల లెక్కింపుకు ముందుకు అమిత్ షా 150 జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లను పిలించారని జైరాం రమేష్ వాదించారు. అయితే తన వాదనకు రుజువులను చూపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం (జూన్ 2) న జైరాం రమేష్ ను కోరింది. రమేష్ కు రాసిన లేఖలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల లోపు జైరాం రమేష్ తన వివరణ తెలపాలని కోరింది.
అమిత్ షా 150 మంది అధికారులను పిలిపించి, బెదిరింపులకు పాల్పడుతున్నారని.. అది బీజేపీ ఎంత ఓటమిపై ఎంత నిరాశతో ఉండో తెలియజేస్తుందని రమేష్ శనివారం (మే30) ఆరోపించారు. అధికారులు ఒత్తిడికి తలొగ్గకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు.
జూన్ 4న మోదీ, అ మిత్ షా ఇంటికి పోవాల్సిందే.. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని , అధికారులు ఒత్తిడికి లోను కాకుండా రాజ్యాంగాన్ని సమర్ధించాలి అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై వివరణ ఇవ్వాలని జైరాం రమేష్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఆదివారం సాయంత్రం 7 గంటల లోపు వివరణ ఇవ్వాలని కోరింది.