అదానీ గ్రూప్‌కు పవర్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆదివారం మండిపడ్డారు. మహారాష్ట్రలో విద్యుత్ సరఫరా చేయడానికి యూనిట్‌కు రూ.4.08 చొప్పున అదానీ గ్రూప్ కాంట్రాక్ట్ ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు అక్కడ విద్యుత్ సేకరణ ఛార్జీలు రూ.1 ఉందని, అదానీకి మహారాష్ట్ర ప్రభుత్వ నిధులు కట్టబెట్టడానికే మోదీ ఇలా చేశారని జైరాం రమేష్ ఆరోపిస్తున్నారు.
గుజరాత్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఖవ్దా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 5వేల మెగావాట్ల సోలార్ పవర్, అదానీ పవర్ అభివృద్ధి చేస్తున్న అల్ట్రా-సూపర్‌క్రిటికల్ ప్లాంట్ నుంచి 1,496 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను మహారాష్ట్రకు సరఫరా చేయడమే ఈ ఒప్పందం. ఇది 'మరో మోదానీ ఎంటర్‌ప్రైజ్' అని ఆయన అన్నారు. ఈ కాంట్రాక్ట్ తో అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధం బయటపడ్డిందని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
ALSO READ | ప్రతిపక్ష నేత నాకు ప్రధాని పదవి ఆఫర్ చేశారు..నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
2024 చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షల్లో కూటమి మహాయుతి ఓటమి పాలవడటం పక్కా అని రమేష్ చెప్పారు. అదానీ గ్రూప్ కు పవర్ కాంట్రాక్ట్ ఇవ్వటంపై ఉన్న మోసం నెమ్మదిగా బయటపడుతుందని ఆయన అన్నారు. త్వరలోనే ఈ మోసపూరిత ఒప్పందంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తాయని జైరాం రమేష్ Xలో పోస్ట్ చేశారు.