
- మోదీజీ.. మాట నిలబెట్టుకుంటరా?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని ఇచ్చిన మాట ను ఇప్పుడైనా నిలబెట్టుకుంటారా? అని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గురువారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దేశంలో మోదీ 3.0 ప్రభుత్వం రాబోతోందని హోరెత్తించారు. కానీ, ఈసారి మోదీ 1/3 ప్రభుత్వమే ఏర్పడింది. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి పదేండ్లు గడుస్తున్నా.. ఇవ్వలేదు.
విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకుంటారా? బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా 2014లో హామీ ఇచ్చారు. ఇప్పటికైనా వీటిపై స్పందిస్తారా?” అని జైరాం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని హామీ ఇవ్వగలరా? అని కూడా ప్రశ్నించారు.