![సీఎం పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్](https://static.v6velugu.com/uploads/2022/12/Jairam-Thakur_8RFfUtIepb.jpg)
హిమాచల్‌ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 28, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. దీంతో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. హిమాచల్ లో 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు.
ఎన్నికల ఫలితాలపై స్పందించిన జైరాం ఠాకూర్.. ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతామన్నారు. లోపాలను విశ్లేషించుకుని ముందుకు వెళ్తామన్నారు. మరోవైపు జైరామ్ ఠాకూర్ తన నియోజకవర్గం సెరాజ్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థిపై 22,వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. జైరామ్ ఠాకూర్.. ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఆరోసారి.