చైనాతో భారత్ సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కామెంట్స్ చేశారు. భారత్ చైనా మధ్య వేరే దేశం జోక్యం అవసరం లేదన్నారు. ఈ సమస్య రెండు పొరుగు దేశాలది అన్నారు. భారత్, చైనాలే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు టోక్యో వచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్, చైనాల మధ్య ఉన్న సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఇతర దేశాల జోక్యాన్ని కోరుకోవడం లేదన్నారు.
అయితే చైనాతో భారత్ మంచి సంబంధాలను కోరుకుంటుందని చెప్పారు. అయితే వారు ముందుగా సంతకం చేసిన LOC, ఇతర ఒప్పందాలను గౌరవిస్తేనే మా సంబంధం మెరుగుపడుతుంది ఉద్ఘాటించారు. 2020 కోవిడ్ -సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అప్పుడు చెలరేగిన ఉద్రిక్తత కారణంగా ప్రాణనష్టం సంభవించిందన్నారు. కాగా 2020 జూన్ లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
Speaking to the press in Tokyo. https://t.co/aShYL1jcuK
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 29, 2024