
ముంబై: టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో తాను ఆడే ముంబై జట్టును వీడి గోవాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2025–26 సీజన్ నుంచి అతను గోవా తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) కోసం మంగళవారం (April 1) ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు లెటర్ రాశాడు.
జైస్వాల్ విజ్ఙప్తిని అంగీకరించిన ఎంసీఏ గవర్నింగ్ బాడీ.. ఎన్‌వోసీని జారీ చేసింది. రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ ముంబై తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 4, 26 రన్స్ మాత్రమే చేశాడు. గోవా తరఫున ఆడేందుకు వస్తున్న జైస్వాల్‌కు స్వాగతం పలుకుతున్నామని గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ షాంబా దేశాయ్ అన్నారు.