దంచికొట్టిన జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్.. సిరీస్ గెలిచిన టీమిండియా

దంచికొట్టిన జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్.. సిరీస్ గెలిచిన టీమిండియా
  • నాలుగో టీ20లో 10 వికెట్లతో ఇండియా విక్టరీ
  • 3-1తో సిరీస్ సొంతం
  • నేడు  ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సా. 4.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

హరారే: యశస్వి జైస్వాల్ (53 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ధనాధన్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడు కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మెరుపులు మెరిపించడంతో  నాలుగో టీ20లో జింబాబ్వేను యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిగిలుండగానే ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 3–1తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన జింబాబ్వే తొలుత 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (46)తో పాటు మురమణి (32)  వెస్లీ మధెవెరె (25) రాణించారు. ఇండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం ఆటగాడు తుషార్ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభిషేక్, శివం దూబే ఒక్కో వికెట్ తీశారు. యశస్వి, గిల్ దూకుడుతో ఇండియా 15.2 ఓవర్లలోనే 156/0 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించిన యశస్వి ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ షాట్లతో విజృంభించగా..కెప్టెన్ గిల్ అతనికి మంచి సహకారం అందించాడు. గిల్ 15 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఉండగానే జైస్వాల్ ఫిఫ్టీ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో) పూర్తి చేసుకున్నాడు. ఆపై గిల్ కూడా జోరు పెంచడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, జింబాబ్వేను ఇండియా పది వికెట్ల తేడాతో ఓడించడం ఇది రెండోసారి. 2016లో ఇదే వేదికపై తొలిసారి ఈ ఫీట్ సాధించింది. చివరి, ఐదో టీ20 ఆదివారం జరగనుంది.

సంక్షిప్త స్కోర్లు

జింబాబ్వే:  20 ఓవర్లలో 152/7 (రజా 46, మురమణి 32, ఖలీల్ అహ్మద్ 2/32)
ఇండియా: 15.2 ఓవర్లలో 156/0 (జైస్వాల్ 93*, గిల్ 58*)