కాంగ్రెస్​ గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదు: జాజాల సురేందర్​

కామారెడ్డి, వెలుగు: వారెంటీ లేని కాంగ్రెస్​పార్టీ గ్యారెంటీ పథకాలను ప్రజలు నమ్మడం లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎద్దేవా చేశారు. సదాశివ్​నగర్, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్​ కార్యకర్తలతో శుక్రవారం మర్కల్​ సమీపంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్​మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు.

మూడు గంటల కరెంట్​ఇచ్చే కాంగ్రెస్​ పార్టీ కావాలా? 24  గంటలు ఉచిత కరెంట్​ ఇచ్చే బీఆర్ఎస్​ పార్టీ కావాలో ప్రజలకు నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్​ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేసిందన్నారు. ఇటీవల బీఆర్ఎస్​  ప్రకటించిన మెనిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతీఒక్కరు సమష్టిగా కృషి చేయాలన్నారు. సమావేశంలో లీడర్లు నర్సింలు, మహేందర్​రెడ్డి, రాజేశ్వర​రావు, దశరథ్​రెడ్డి, భూంరెడ్డి,   సాయిరెడ్డి, అశోక్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.