బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలి : జాజుల లింగం గౌడ్

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు  బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ డిమాండ్​ చేశారు.  బీసీ కుల సంఘాల నేతలతో   బుధవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు.   పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ భవన్ కు  స్థలం కేటాయించాలన్నారు. 

 బీసీ రిజర్వేషన్లు పెంపు అనంతరమే స్థానిక సంస్థల, మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సీనియర్ నేతలు  అంకతి సత్యమయ్య, బంటు వెంకటేశ్వర్లు, సందనబోయిన జయమ్మ, నాగేశ్వరరావు యాదవ్, ఎర్రబెల్లి దుర్గయ్య పాల్గొన్నారు.