- సెప్టెంబర్ 10న బీసీ సింహగర్జన సక్సెస్ చేద్దాం
కరీంనగర్ టౌన్,వెలుగు: సెప్టెంబర్ 10న హైదరాబాద్లో నిర్వహించే బీసీ సింహగర్జనకు పెద్ద సంఖ్యలో బీసీలు హాజరై విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్ తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బీసీల వ్యతిరేకి అని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే రెడ్ల, రావుల పార్టీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో తండ్రికి బదులు కొడుకులకు, కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించుకుంటూ కుటుంబ వారసత్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాబోవు ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఓటేసి గెలిపించి, అగ్రవర్ణాలను ఓడించాలని పిలుపునిచ్చారు. బీసీల్లో 136కులాలు ఉంటే కేవలం 6కులాలకు మాత్రమే బీఆర్ఎస్ లో ఎలా టికెట్లు కేటాయిస్తారని విమర్శించారు.