- బీసీలు చట్టసభలకు వెళ్లకుండా కుట్ర
- అగ్ర కులాలకు ఓట్లువేసే యంత్రాలుగా మిగలొద్దు
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
కల్వకుర్తి, వెలుగు : 60 శాతం ఉన్న బీసీలను చట్టసభలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా అగ్రకులాలకు చెందినవారు కుట్ర చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం కల్వకుర్తిలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు బీసీలకు తక్కువ టికెట్లు ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీలను జెండాలు మోయించడం కోసమే ఉపయోగించుకున్నారన్నారు.
బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించలేదని, వారిని కేవలం రాజకీయ పాలేర్లుగా చూస్తున్నారన్నారు. అగ్రకులాలకు ఓటు వేసే యంత్రాలుగా మిగిలిపోవద్దని బీసీలకు సూచించారు. బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, బీసీ నాయకులు సుధాకర్, రాజేందర్, మధు, శ్రీనివాస్ యాదవ్, బీఎల్గౌడ్ పాల్గొన్నారు.