హనుమకొండసిటీ, వెలుగు : బీసీ రిజర్వేషన్లు పెంచి, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హనుమకొండ లో గురువారం ‘సమగ్ర కుల గణన యాత్ర సభ’ ను ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
బీసీలు లెక్కలు తీయమంటే ప్రభుత్వాలకు బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు కులగణన చేపడతామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట విధంగా బీసీ కులగణన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.