- కులగణన కోసం ‘చలో హైదరాబాద్ మార్చ్’
- జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు: హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్డిమాండ్చేశారు. మూడు నెలల్లో కులగణన చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శ్రీనివాస్ గౌడ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్నాయకులు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ఊసెత్తడం లేదన్నారు.
ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు లేవన్నారు. ఇప్పటికైనా కులగణన చేపట్టి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే 25 నుంచి ‘చలో హైదరాబాద్’ మార్చ్నిర్వహిస్తామని హెచ్చరించారు.