
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనందున బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పూల రవీందర్, ప్రసన్న హరికృష్ణ, మల్క కొమరయ్యకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ అభ్యర్థులకు మద్దతిచ్చి బీసీలపై బీఆర్ఎస్ తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలిపారు.
ఆదివారం ఈ అంశంపై బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. బీసీ వాదంతో వస్తున్న కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఖరేంటో స్పష్టం చేయాలని పేర్కొన్నారు. బీసీలను రాజకీయంగా లబ్ధి కోసం వాడుకోకుండా రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కృషి చేయాలని వివరించారు. బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఆర్ ఎస్ మద్దతు ఇవ్వకపోతే బీసీల గురించి మాట్లాడే నైతికతను ఆ పార్టీ కోల్పోతుందని వెల్లడించారు.